అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, తాజా మాజీ కౌన్సిలర్లు కూతురు పద్మ,బద్దం జగన్ మోహన్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.