హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ASF: సిర్పూర్ (టి)లో 2019లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్‌కు జీవిత ఖైదు, రూ. 10,000 జరిమానా విధించినట్లు SC, ST కోర్టు తీర్పు వెలువరించిందని SP నితికా పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేతనాల విషయంలో బిర్జుతో జరిగిన గొడవలో ఓం ప్రకాష్ కత్తితో పొడవడంతో బిర్జు మృతి చెందాడు. దర్యాప్తు, సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువై శిక్ష ఖరారైందని SP వెల్లడించారు.