VIDEO: గూడూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

VIDEO: గూడూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం రైతులకు భారీ ఆందోళన కలిగించింది. మిర్చి పంటలు దెబ్బతింటాయని, మొక్కజొన్న పంటలు నేలకొరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా పంటలు పాడై ఆర్థిక నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.