ఇలాంటి స్కామ్ దేశంలో ఎక్కడా లేదు: జగన్
AP: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని మాజీ సీఎం జగన్ తెలిపారు. ఏడాదికి రూ.60 కోట్లు జీతాల రూపంలో ఇస్తామని చెప్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్కామ్ దేశంలో ఎక్కడా ఉండదన్నారు. 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని గుర్తు చేశారు. మిగతా కాలేజీలు పూర్తి చేయడానికి ఏడాదికి వెయ్యి కోట్లు అవసరమని పేర్కొన్నారు.