పేరుపాలెం బీచ్‌ను సందర్శించిన ఆర్డీవో
W.G: మొగల్తూరు మండలంలోని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆదివారం పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ రాజ్ కిషోర్‌తో కలిసి పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం నిత్యవసర సరుకులు అందిస్తుందన్నారు. అలాగే బీచ్‌లో పర్యటకుల సందర్శన నిలిపివేసినట్లు తెలిపారు.