వృథాగా త్రాగునీరు.. పట్టించుకోరా..?

వృథాగా త్రాగునీరు.. పట్టించుకోరా..?

కృష్ణా: మైలవరంలోని దేవుడి చెరువుకు వెళ్లే దారిలో మంచినీటి పైపులు నెలల తరబడి పగిలిపోయి ఉన్నా.. మరమ్మతులు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపించారు. వేసవిలో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలుచోట్ల పైపులు పగిలి నీరు వృథాగా డ్రైనేజీలో కలుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.