'పిల్లల్ని దత్తత తీసుకునే వారు చట్టబద్ధంగా తీసుకోవాలి'
KNR: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సంక్షేమ ట్రస్ట్ కపిల్ కుటీర్ శిశు సంరక్షణ కేంద్రంలో దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు, దత్తతకు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. శిశువులను, పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు చట్టబద్ధంగా తీసుకోవాలన్నారు.