‘71 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది’
MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో 71 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఎంపీడీవో ప్రసాద్, హౌసింగ్ ఏఈ అమీర్ ఖాన్ తెలిపారు. ఇవాళ మండలంలోని ధర్మరావు పేటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 692 ఇందిరమ్మ ఇలా నిర్మాణం చేపట్టగా, వాటిలో 71 పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు.