వల్లభ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

వల్లభ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

KKD: పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.31,66,081 వచ్చినట్లు ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం దేవస్థానంలో స్వామి హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ఆదాయం రూ.23,89,935,‌ అన్నదానం ఆదాయం రూ.7,76,146 వచ్చినట్లు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి కే.నాగేశ్వరరావు లెక్కింపును పర్యవేక్షించారు.