శ్రీశైలంలో నెలకొన్న భక్తుల రద్దీ
NDL: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను నిలిపివేశారు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా స్వామివారి స్పర్శ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్న వారికి దర్శనానికి ఆలయ సిబ్బంది అనుమతిస్తున్నారు.