అనుమానాస్పదంగా యువకుడు మృతి

MDK: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చేగుంట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై చైతన్య రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కన్యారం గ్రామానికి చెందిన వడ్డే హరి(21) రాయి కొట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇవాళ హై టెన్షన్ టవర్ వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.