'నష్టపోయిన రైతులను ఆదుకోండి'

KRNL: అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆస్పరి, దేవనకొండ మండలాల్లోని నీట మునిగిన పంటలను జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించారు. పది రోజుల నుంచి వర్షాలు కురిసి నీటితో పంట పొలాలు దెబ్బతిన్న జిల్లా అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు.