VIDEO: శనిగరం జాతీయ రహదారిపై మొక్కజొన్న ఆరబోత
WGL: శనిగరం జాతీయ రహదారికి ఇరువైపులా రైతులు మొక్కజొన్నను ఆరబోశారు. రోడ్డు పైభాగంలో ఎక్కువ స్థలం ఆక్రమించడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు పంటను ఆరబెట్టుకోవడం అవసరం అయినప్పటికీ, రహదారిపై ఆరబెట్టడంపై ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ప్రయాణికులు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనల వల్ల ప్రమాదాలు జరిగినప్పటికీ రైతుల తీరు మారడంలేదని వాహనదారులు వివరించారు.