శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక శోభ
KRNL: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శివనామ స్మరణతో శ్రీగిరి మారుమోగుతోంది. భక్తులు ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానం చేసి, స్వామి, అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలిచారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది.