'మహిళలు చరిత్ర సృష్టించారు'
CTR: మహిళా క్రికెట్ చరిత్రలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిందని జిల్లా ఇంఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆదివారం జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత మహిళా జట్టు విజయం సాధించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు.