కొత్తపేటలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కొత్తపేటలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కోనసీమ: సామాజిక సంస్కర్త, తొలి ఉద్యమకారుడు, నవయుగ వైతాళికుడు, మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు శనివారం కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక RS BC కన్వెన్షన్ హాల్ వద్ద కొత్తపేట మండల శెట్టిబలిజ సంఘం (పెద్దలు), యువ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంఘ సభ్యులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.