31న విశాఖలో 'రాజ్యాంగ పరిరక్షణ సదస్సు'
VSP:: ఈ నెల 31న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నట్లు దళిత హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల రాంబాబు తెలిపారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో "రాజ్యాంగం - దళిత హక్కులు - బీజేపీ విధానాలు" అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది. మంగళవారం సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు.