ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ దాడులు

ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ దాడులు

ఇరాన్ భారీగా మిస్సైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దాటుకుని క్షిపణులు దూసుకురావడంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో విధ్వంసం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అంతర్జాతీయ సమాజం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.