గంజాయి కేసుల ముద్దాయిలకు డీఎస్పీ కౌన్సెలింగ్

GNTR: గంజాయి తాగిన, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన ముద్దాయిలకు ఆదివారం కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయని ఆయన సూచించారు.