VIDEO: రోడ్డు మీద చెత్త తొట్టెతో ఇబ్బందులు

VIDEO: రోడ్డు మీద చెత్త తొట్టెతో ఇబ్బందులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శానిటరీ విభాగం అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టే దృశ్యం. కృష్ణ బజార్ నుంచి ఐదు రోడ్ల జంక్షన్ కు వెళ్లే కీలక రహదారిలో రోడ్డు మీదే చెత్త తొట్టెను పెట్టడంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. అసలే ఇరుకు రోడ్డు కావడం మరో పక్క చెత్త తొట్టి నుంచి దుర్వాసన బయటికి రావడంతో ప్రజలు దీనిని తోలగించాలని డిమాండ్ చేస్తున్నారు.