'రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలి'
MDK: రామాయంపేట వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రామయంపేట, నిజాంపేట, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.