VIDEO: ఆలయంలో కార్తీక శోభ
GDWL: దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించామని ఈవో దీప్తి తెలిపింది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి, జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు.