200 క్వింటళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం పోలీసులు సుమారు 200 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఖమ్మం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా లారీలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న దంతాలపల్లి పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.