'కార్మేని సెల్వం' ట్రైలర్ విడుదల
సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కార్మేని సెల్వం'. రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.