'పథకాల అమలులో ప్రజా సంతృప్తి పెరగాలి'

GNTR: ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి శాతం పెరిగేలా జిల్లా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. గుంటూరులో సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు వినూత్నంగా ఉంటాయని, ఆయన ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉంటాయన్నారు.