రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కర్నూలు కృష్ణనగర్ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాసీం బాషా (50) మృతి చెందాడు. నందవరం గ్రామానికి చెందిన ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. వెనుక నుంచి వచ్చిన లారీ తలపై నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు LIC ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.