ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి రాజ్యసభ సభ్యునిగా గురువారం ఢిల్లీలో, వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.