VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
SKLM:తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాసవాసులు ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇవాళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో పలాస వాసులు పైడి సాయి, ఇల్లాకుల నవీన్ మృతి చెందగా, గుంట రాజు, పైడి తారకేశ్వరరావు,పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.