VIDEO:టేకుమట్లలో కుక్కల బెడద..
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతుంది. కుక్కల బెడదతో స్థానిక ప్రజలకు ప్రయాణికులకు భయాందోళన కలుగుతున్నాయి. గ్రామ ప్రజలను కుక్కలు కరిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు అధికారులకు విన్నవించిన స్పందన లేదని గ్రామస్తులు తెలియజేశారు.