శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం
అన్నమయ్య: మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.