పీజీఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
BPT: జిల్లా కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, అనంతరం ఉ. 10 నుంచి 1 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వివినియోగించుకోవాలని కోరారు.