తెగిన నాగంచెరువు అలుగు

KMR: లింగంపేట మండలంలోని బాణాపూర్ నాగంచెరువు అలుగు తెగిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చిన వరద ఉద్ధృతి పెరిగి చెరువుకట్ట తెగిపోయింది. క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో కట్టకు మరింత గండి పడుతుందేమోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.