ఆయిల్‌ పుల్లింగ్‌తో నోటి ఆరోగ్యం

ఆయిల్‌ పుల్లింగ్‌తో నోటి ఆరోగ్యం

ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బ్యాక్టీరియా తగ్గి చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, క్యావిటీస్ వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాలు తెల్లగా మారుతాయి. ఆయిల్ పుల్లింగ్‌కు ఆలివ్, కొబ్బరి, నువ్వుల నూనెలను వాడొచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించాలి. కొంత నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ నూనె మింగకూడదు.