VIDEO: పోచారం ప్రాజెక్టులో తగ్గుముఖం పట్టిన వరద

NZB: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి-నాగిరెడ్దిపేట్ మండల రైతులకు వరప్రదాయినిగా ఉన్న పోచారం ప్రాజెక్టు రిజర్వాయర్లో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి 3,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుందని ప్రాజెక్టు డీఈ.షేర్ల వెంకటేశర్లు తెలిపారు. ప్రాజెక్టు కట్టపై నుండి 3,854 క్యూసెక్కుల నీరు మంజీరా ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందన్నారు.