వేప చెట్టు ఒడిలో ఒదిగిన మర్రిచెట్టు
MBNR: అడ్డాకుల మండలంలోని జాతీయ రహదారి పక్కన కాటవరం స్టేజ్ సమీపంలో ప్రకృతి అద్భుతం కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద వేప చెట్టును అదుముకుంటూ మర్రిచెట్టు మొలకెత్తి పెరుగుతుంది. ఈ అరుదైన దృశ్యం జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఆకట్టుకుంతుంది. వేప చెట్టు తన ఒడిలో ఒక చిన్న మొక్కను ఒదిగించుకున్నట్టుగా కనిపించడం ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ అద్భుత దృశ్యం SMలో వైరల్‌గా మారింది.