ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి

ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి

AP: కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. ఇప్పటికే 90 శాతం మేర హామీలు అమలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. కాగా అనంతపురంలో మరికొద్దిసేపట్లో సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ జరగనుంది.