సకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలి: కలెక్టర్
KKD: 'మొంథా' తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ షన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, పౌరసరఫరాల శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ. 3 వేల ఆర్థిక సహాయం పంపిణీ, పంట నష్ట గణనపై చర్చించారు.