'ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
KKD: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గొల్లప్రోలు EOPRD విద్యాసాగర్ కోరారు. చేబ్రోలు గ్రామంలో మంగళవారం ఉదయం పర్యటించిన ఆయన, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా పారిశుధ్య సిబ్బందికే అందజేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు.