రామంతాపూర్ ఘటనలో చనిపోయింది వీరే..!

HYD: రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో కరెంట్ షాక్‌తో మృతిచెందిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేంద్ర రెడ్డి(39) ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపగా కుటుంబసభ్యులు, కాలనీవాసుల రోదనలు మిన్నంటుతున్నాయి.