వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు శుక్రవారం విశాఖపట్నం వాస్తవ్యులు ములక నాని బాబు , స్వాతి దంపతులు రూ.50,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం కమిషనర్ దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందించారు.