గుంటూరులో సోలార్ స్కీమ్‌కు భారీ స్పందన

గుంటూరులో సోలార్ స్కీమ్‌కు భారీ స్పందన

గుంటూరు: పీఎం సూర్యఘర్ పథకం కింద గుంటూరులో సోలార్ ప్యానెల్స్ కోసం 1.22 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు యూనిట్లు ఉచితం కాగా, ఇతరులకు కేంద్రం రూ.60 వేల సబ్సిడీ ఇస్తోంది. దరఖాస్తుల్లో సుమారు 30% బీసీలవే. వీరికి రాష్ట్రం అదనంగా రూ.20 వేల రాయితీ ప్రకటించడంతో మార్గదర్శకాల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.