KTRను కలిసిన మాజీ ఎమ్మెల్యే
WGL: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఇవాళ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే వివరించి పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆరూరికి కేటీఆర్ సూచించారు.