ఘనంగా శ్రీరామ నవమి

తూ.గో: శ్రీ రామ నవమి వేడుకలు గిరిజన ప్రాంతంలో ఘనంగా జరిగాయి. రాజవొమ్మంగి మండలంలో బుధవారం తెల్లవారుజామునుంచే భక్తులు అధిక సంఖ్యలో సమీపంలోని రామలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలయాల వద్ద దంపతులు కూర్చొని కళ్యాణాలు జరిపించుకొన్నారు. అన్నదాన కార్యక్రమాలకు ఆలయ కమిటీలు భారీగా ఏర్పాట్లు చేశారు.