హిందూపూర్‌లో చలివేంద్రం ప్రారంభం
NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ యువకులు ఎండల తీవ్రత దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా చల్లని తాగునీరు అందిస్తున్నారు. ఎండల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని ఈ సందర్భంగా యువకులు సూచించారు. ప్రజలు ఎండల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.