రోడ్లపైకి పశువులను విడిచి పెట్టరాదు: ఎస్సై
SRPT: వేసవి కాలంలో పశువులను, గేదెలను రోడ్లపైకి విడిచి పెట్టరాదని మునగాల ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గేదెలు అడ్డురావటంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. బర్రెలు మేత కోసం రోడ్ల డివైడర్ మధ్యలోకి వెళ్లుతున్నాయని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించి వారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.