క్వాలిస్, సుమో మళ్లీ వస్తాయా?

క్వాలిస్, సుమో మళ్లీ వస్తాయా?

వింటేజ్ కార్ల క్రేజ్ మళ్లీ మొదలైంది. మహీంద్రా స్కార్పియో, టాటా సియెర్రా రీ-ఎంట్రీతో మార్కెట్ హీటెక్కింది. దీంతో కార్ లవర్స్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు రోడ్లను రారాజుల్లా ఏలిన 'టొయోటా క్వాలిస్', 'టాటా సుమో'ను కూడా మళ్లీ తీసుకురావాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. మరి కంపెనీలు కస్టమర్ల మాట వింటాయో లేదో చూడాలి.