క్రమంగా పెరుగుతున్న మున్నేటికి వరద

KMM: వారం రోజులుగా ఖమ్మం మున్నేటికి ఎగువ నుంచి వరద తాకిడి లేకపోవడంతో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం ఒక్కసారిగా వరద పెరిగింది. మున్నేటికి ఎగువ ప్రాంతాల్లో వర్షం కురవడం, పాకాల నుంచి వరద వస్తుండడంతో కాల్వొడ్డు వద్ద 10 అడుగులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మున్నేరు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు.