ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
SKLM: నగర కార్పొరేషన్ బుచ్చిపేటలో శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవ మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలుతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.