కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

కేజీబీవీలో  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

NRML: జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న '99 రోజుల ప్రత్యేక ప్రణాళిక' క్షేత్రస్థాయి అమలును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వయంగా పర్యవేక్షించారు. గురువారం నిర్మల్‌లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో సంభాషించి, వారికి అందుతున్న వసతులు, విద్యా బోధన, ఇతర సమస్యలపై ఆరా తీశారు.