నేడు ఈ గ్రామాలకు పవర్ కట్
ప్రకాశం: కొమ్మరోలు మండలంలోని తాటిచెర్ల సబ్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస రావు తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కపల్లి, పొట్టిపల్లి గ్రామాల్లో ఆర్డీఎస్ఎస్ కొత్త లైన్లు వేస్తున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు గమనించి, సహకరించాలని కోరారు.